ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు.

ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షకు సోమవారం నలుగురు విద్యార్థులు గైరాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సర భౌతిక, అర్థశాస్త్రం పరీక్షలకు 128 మంది విద్యార్థులకు గాను ముగ్గురు విద్యార్థులు పరీక్షలకు గైరాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ అంబాజీ, డిపార్ట్మెంటల్ అధికారి వెంకటేశ్వర్ నివాస్ తెలిపారు.
ఒకేషనల్ పరీక్షకు 40 మంది విద్యార్థులకు గాను ఒక విద్యార్థి గైరాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు వైద్య సదుపాయం తాగునీరుతోపాటు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
