12 Yrs Rupee Surges Record : రూపాయి పెరిగిందోచ్​.. Andhra Prabha News

12 Yrs Rupee Surges Record : రూపాయి ;పెరిగిందోచ్​.. Andhra Prabha News

  • 12 ఏళ్ల రికార్డు బ్రేక్​
  • సింగిల్​ డే సూపర్​ రికవరీ
  • ఎన్డీఎఫ్​ రద్దు
  • విదేశీ మారక ద్రవ్యం పరిమితి కట్టడి
  • ఆర్బీఐ టానిక్​ ఫలితం..
  • ₹ 95.22కు చెల్లు చీటి
  • ఇప్పుడు డాలర్​.. ₹ 93.10

( ఆంధ్రప్రభ, బిజినెస్​ ​ డెస్క్) ​

డాలర్​ లో 12 ఏళ్ల పోరాటంలో తొలి సారిగా ఒకే ఒక్క రోజులో రూపాయి బాహుబలిగా నిలబడింది. ఏప్రిల్ 2, 2026న అమెరికన్ డాలర్‌తో పోలిస్తే అసాధారణ రీతిలో పుంజుకుంది. ఇది సెప్టెంబర్ 2013 తర్వాత, అంటే దాదాపు 12 ఏళ్లలో రూపాయి నమోదు చేసిన అత్యుత్తమ సింగిల్-డే రికవరీగా నిలిచింది. ₹ రూపాయి విలువ ఒకే రోజులో సుమారు 151 పైసలు (1.6% నుంచి 1.8% వరకు) పెరిగింది. మార్చి 31న రికార్డు కనిష్ట స్థాయిలో 95.22 వద్ద ముగిసిన రూపాయి, ఆర్‌బీఐ టానిక్​ చర్యలతో 93.10 – 93.19 స్థాయికి బలపడింది.

12 Yrs Rupee Surges Record : దెబ్బ మీద దెబ్బ

పశ్చిమాసియా (ఇరాన్-ఇజ్రాయెల్) యుద్ధం ఆరంభం నుంచి , భారత రూపాయి విలువ పడటమే గానీ.. లేవటం తెలియని నిస్సత్తువతో.. బలహానపడింది. అనేకసార్లు చారిత్రక కనిష్ట స్థాయిలను తాకింది. ఈ కాలంలో రూపాయి విలువ సుమారు 4% కంటే ఎక్కువ క్షీణించింది. అటు భీకర యుద్ధం.. ఇటు హోర్ముజ్​ జలసంధి మూసివేతతో ముడి చమురు ధర చేతులు కాలే స్థితికి చేరింది. ఫలితంగా డాలరు బాహుబలి అవతారం ఎత్తగా.. రూపాయి తీరవ క్షీణ రోగి స్థితి చేరింది.

12 Yrs Rupee Surges Record : రూపాయి పతనం ఇలా..

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్​ యుద్ధంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $120 వరకు చేరగా భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. చమురు ధరల పెరుగుదల స్టాక్​ మార్కెట్​ పై తీవ్ర ప్రభావం చూపింది. విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క మార్చి నెలలోనే సుమారు $1200 కోట్ల షేర్లను విక్రయించి భారత మార్కెట్ లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తిగా భావించే అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపడంతో రూపాయి బలహీనపడింది.

12 Yrs Rupee Surges Record : ఆల్​ లైమ్​.. లోయర్​ రికార్డ్​

2026 మార్చి 20 న రూపాయి విలువ ₹ 93 మార్కును దాటింది. ఆ రోజు ఇంట్రాడేలో ₹ 93.81 వద్ద ఆల్-టైమ్ లోయర్​ స్టేజీని తాకింది. మరో వారం రోజుల్లోనే 2026 మార్చి 27న : రూపాయి మరింత పతనమైంది. ₹ 94 స్థాయిని దాటి, ట్రేడింగ్ ముగిసే సమయానికి ₹ 94.84 వద్ద స్థిరపడింది. 2026 మార్చి 30-31 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనైంది. మార్చి 30న తొలిసారిగా ₹ 95 స్థాయిని దాటి, మార్చి 31న ఇంట్రాడేలో ₹ 95.6 వద్ద అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది.

12 Yrs Rupee Surges Record : స్పెక్యులేషన్​ కు ఆర్బీఐ సంకెళ్లు

తీవ్ర పతనావస్థ నుంచి రూపాయి కోలుకోవటానికి ఆర్బీఐ కఠిన నిర్ఱయాలు తీసుకుంది. అడ్డుకోవడానికి ఏప్రిల్ 1, 2026న ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు తీసుకుంది: డాలరు పరుగుకు బ్రేక్​ వేసింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి , మార్కెట్ స్పెక్యులేషన్ (ధరల హెచ్చుతగ్గులపై బెట్టింగులు) తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన నిర్ణయాలు తీసుకుంది: NDF మార్కెట్‌ ను నిషేదించింది. బ్యాంకులు తమ క్లయింట్‌లకు (నివాసితులు అనివాసితులు ఇద్దరికీ) రూపాయి ఆధారిత నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (NDF) కాంట్రాక్టులను ఆఫర్ చేయకుండా కఠినంగా నిషేధించింది.ఇక నెట్ ఓపెన్ పొజిషన్ (NOP) పరిమితిని కట్టడి చేసిందిజ బ్యాంకులు విదేశీ మారక ద్రవ్యంలో కలిగి ఉండగలిగే నికర ఓపెన్ పొజిషన్‌పై ఆర్‌బీఐ $100 మిలియన్ల గరిష్ట పరిమితిని విధించింది. దీనివల్ల బ్యాంకులు తమ వద్ద అదనపు డాలర్లను మార్కెట్లో విక్రయించక తప్పలేద. రద్దు చేసిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ డెరివేటివ్ కాంట్రాక్టులను మళ్లీ బుక్ (Re-booking) చేయడానికి కంపెనీలను అనుమతించకూడదని నిర్ణయించింది. దీనివల్ల నిరంతరం జరిగే స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు అడ్డుకట్ట పడింది. రూపాయి విలువను కాపాడటానికి ఆర్‌బీఐ నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి పెద్ద మొత్తంలో డాలర్లను విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

12 Yrs Rupee Surges Record : రూపాయికి ఊరట

ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో గురువారం భారత రూపాయి బలపడింది. దేశీయ (ఆన్‌షోర్) నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ మార్కెట్ల మధ్య అంతరం పెరగడం, హెడ్జింగ్ ఖర్చులపై ఈ చర్యల ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. స్థానిక ప్రవాస ఖాతాదారులకు రూపాయి నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్‌లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించిన తర్వాత, ప్రారంభంలో రూపాయి 1.4% పెరిగింది. దేశీయ మార్కెట్‌లో దిగుమతిదారులకు హెడ్జింగ్ ఖర్చులు ఒక నెలకు సుమారు 30 పైసలు, రెండు నెలలకు దాదాపు 66 పైసలు, మూడు నెలలకు 96 పైసలుగా ఉన్నాయి. ఇదే కాలపరిమితిలో, ఆఫ్‌షోర్ NDF మార్కెట్‌లో హెడ్జింగ్ ఖర్చులు ఒక నెలకు సుమారు 80 పైసలు, రెండు నెలలకు దాదాపు 1.64 రూపాయలు, మూడు నెలలకు దాదాపు 2.42 రూపాయలుగా గణనీయంగా ఎక్కువగా ఉన్న పరిస్థితికి ఇది భిన్నంగా ఉంది.

Leave a Reply