వోడ్నాల శ్రీనివాస్ అందరివాడు… ఆశీర్వదించండి

వోడ్నాల శ్రీనివాస్ అందరివాడు… ఆశీర్వదించండి

కష్టం విలువ తెలిసిన నాయకుడు శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ
మంత్రి శ్రీధర్ బాబు

మంథని: మంథని మున్సిపల్ పరిధిలోని 11 వ వార్డ్ నుంచి పోటీ చేస్తున్న వోడ్నాల శ్రీనివాస్ అందరివాడని, ఆయనను ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. శ్రీనివాస్ కష్టం విలువ తెలిసి నాయకుడని, ఎదుటివారి అభివృద్ధి గురించి ఆలోచించే ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని మంత్రి తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… 11 వ వార్డు తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వోడ్నాల శ్రీనివాస్ చిన్ననాటితనం నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎదిగాడని ఆయన గుర్తు చేశాడు. శ్రీనివాస్ గెలిస్తే యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని, 11 వార్డు ప్రజలందరూ ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేసి శ్రీనివాస్ ను ఆశీర్వదించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు . అందరికీ అందుబాటులో ఉండే శ్రీనివాస్ గెలిస్తే అభివృద్ధి గెలిచినట్లే అని ఆయన తెలిపారు.

Leave a Reply