ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య ఆశీస్సులతో అభివృద్ధి..

ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య ఆశీస్సులతో అభివృద్ధి..
- చేయి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి..
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..
- కాంగ్రెస్ జెండా గెలుపు ఖాయం..
14వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పెసరు కృష్ణవేణి సారయ్య
స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెసరు కృష్ణవేణి సారయ్య పోటీ చేస్తున్నారు. ఈసందర్భంగా గురువారం అభ్యర్థి వార్డులోని నెలకొన్న పలు సమస్యలను గుర్తించి, పరిష్కారానికి హామీలు ప్రకటించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వార్డులోని నిరుపేదలకు అన్యాయం జరిగింది. అప్పట్లో పాలక మండలి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది వాస్త వమని పేర్కొన్నారు. ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
అర్హులకు నీతి, నిజాయితీగా ఇళ్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గల్లీల్లో సీసీ రోడ్లు, మోరీలు, పైప్‌లైన్లు లేని ప్రాంతాలను గుర్తించి మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో వార్డు ఇన్చార్జిలు నాయకులు నామాల బుచ్చయ్య, కావటి భాస్కర్ యాదవ్, తాటికొండ వెంకటేష్ యాదవ్, యువజన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
