10వ వార్డులో ‘హస్తం’ ప్రభంజనం..

10వ వార్డులో ‘హస్తం’ ప్రభంజనం..

డీకొండ పద్మ గెలుపు కోసం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రచారం
భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు రూపురేఖలు మారుస్తా

బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభంజనం సృష్టించాయి. అభ్యర్థి డీకొండ పద్మ గెలుపును ఆకాంక్షిస్తూ బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ఆదివారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. సుమారు 500 మంది మహిళలు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో 10వ వార్డు అంతా ‘జై కాంగ్రెస్’ నినాదాలతో మారుమోగింది. ప్రచారంలో భాగంగా డీకొండ పద్మ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను ప్రజల ముందు ఉంచారు. ముదిరాజుల చిరకాల కోరికైన కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని, వార్డులోని పెద్దమ్మ టెంపుల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అలాగే రైల్వే హమాలీల కష్టాలను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా హమాలీ భవన్ నిర్మిస్తామని, సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి సహకారంతో తాను గెలిచిన కేవలం 3 నెలల్లోనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పద్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ మేలు చేస్తున్నాయని, 10వ వార్డు సమగ్ర అభివృద్ధి చెందాలంటే డీకొండ పద్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే గారు కేటాయించిన రూ.500 కోట్ల నిధులతో వార్డు రూపురేఖలు మార్చుతామని హామీ ఇచ్చారు. ఈ భారీ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ చొప్పరి శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ సుక్క సది, సీనియర్ నాయకులు డీకొండ రాజలింగు, చొప్పరి కొమురయ్య, నాగరాజు, గోమాస బీమయ్య, నక్క కిరణ్, తాటికొండ రాజశేఖర్, లింగాల రాజేశేఖర్, పెండెం అనిత, కనకుంట్ల వేణు , పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply