ఘనంగా దేవస్థానాల 10వ వార్షికోత్సవం

ఘనంగా దేవస్థానాల 10వ వార్షికోత్సవం

దేవినేని ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు

ఇబ్రహీంపట్నం ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామ స్వామి వారి 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న దేవినేని ఉమాకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.

అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామాల్లో దేవాలయాలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, ఇటువంటి ఉత్సవాలు ప్రజల్లో భక్తి, సాంప్రదాయ విలువలను పెంపొందిస్తాయని దేవినేని ఉమ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply