108 సేవలు అద్భుతం…

108 సేవలు అద్భుతం…

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఇంటి దగ్గరే 108 అంబులెన్సు సిబ్బంది పురుడు పోశారు.
108 ఈఎంటి సిబ్బంది సీతారాం వెల్లడి…

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మునీరాబాద్ పట్టణంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ఇంటిలోనే 108 సిబ్బంది మంగళవారం రోజు పురుడు పోశారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి 108 అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దనే పురుడు పోసినట్లు అంబులెన్స్ ఈఎంటి సీతారాం వెల్లడించారు. మునీరాబాద్ మునిసిపల్ పట్టణానికి చెందిన సమంజ సద భార్య ఆర్తి కుమారి వయస్సు (22)పురిటి నొప్పులతో బాధపడుతుంటే అంబులెన్స్ కి ఫోన్ చేయడంతో గుండ్లపోచంపల్లికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సీతారాం, పైలట్ అశోక్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఇంటి వద్దనే పురుడు పోశారు.

ఈ నేపథ్యంలో ఆర్తి కుమారికి నొప్పులు అధికం అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లే సమయం లేదని గమనించిన ఈఎంటి సిబ్బంది. ఆర్.సి.పి డాక్టర్ స్మిత సూచనల మేరకు ఇంటి వద్దనే పురుడు పోసినట్లు చెప్పారు. బాధితురాలు ఆర్తి కుమారి అంబులెన్స్ సిబ్బంది సహకారంతో పండంటి ఆడబిడ్డకి ఉదయం 9:30 గంటలకు జన్మనిచ్చిందని తెలిపారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న బాధితురాలి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

బాధితురాలి కి డెలివరీ జరిగిన తర్వాత సంరక్షణ కోసం తల్లి బిడ్డలను దగ్గరలో ఉన్న మేడ్చల్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డలను కాపాడినందుకు ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు సీతారాం తో పాటు పైలట్ అశోక్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply