103 rewards | ఉగాది పురస్కారానికి ఎంపిక‌…

103 rewards | ఉగాది పురస్కారానికి ఎంపిక‌…

103 rewards | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం చౌదరి పేటకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం.శ్రీనివాస ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఉగాది ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. 1984లో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరిన శ్రీనివాస ప్రసాద్ 2010లో హెడ్ కానిస్టేబుల్ గా, 2014లో ఏఎస్ఐగా 2020లో సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొందారు. ప్రస్తుత సిఐడి విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.

గుడివాడలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో దీర్ఘకాలం పనిచేసిన ఆయనకు రాజకీయ ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, సామాజిక, మీడియా సంస్థల ప్రతినిధులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. 47 ఏడేళ్ల శ్రీనివాసరావు 2020లో రాష్ట్ర ప్రభుత్వం నుండి సేవా పతాకం, పోలీస్ శాఖ నుండి 103 రివార్డులు అందుకున్నారు. నిన్న ప్రకటించిన ఉగాది పుష్కరాలు ఆయన సేవా పతకానికి ఎంపిక కావడం పట్ల పట్టణంలోని సామాజికవేత్తలు హార్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

click here to read more : గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు..

click here to read more

Leave a Reply