100 Questions | త్రినిటీలో రామానుజన్ ఒలంపియాడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్

100 Questions | త్రినిటీలో రామానుజన్ ఒలంపియాడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్
- ప్రారంభించిన ఎంఈఓ గురువారావు
100 Questions | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆధునిక గణిత శాస్త్ర ఆది గురువు శ్రీనివాస రామానుజం జయంతి, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే త్రినిటీ విద్యాసంస్థలు(Trinity Educational Institutions) ఒకటి నుండి 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థినుల ప్రతిభను వెలికి తీయడం కోసం రామానుజన్ ఒలంపియాడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(Olympiad Aptitude Test) 2025ను ఈ రోజు నిర్వహించారు.
ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలను మండల విద్యాధికారి గురువారావు ఆవిష్కరించి పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ… విద్యార్థులలోని సృజనాత్మకతను, సమయస్ఫూర్తిని, జ్ఞాపకశక్తిని, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం, 100 ప్రశ్నలు(100 Questions), 100 మార్కులు ప్రశ్నాపత్రాలలో ఉండడం వలన విద్యార్థులు ముందు ముందు జరగబోవు పోటీ పరీక్షలకు ముందస్తు సంసిద్ధతకు ఉపయోగపడుతుందన్నారు.
ఈ పరీక్షలను త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, గణిత శాస్త్ర అధ్యాపకులు శివరాణి, శ్రీవాణి, రవీంద్ర, విజయ్ కుమార్, సౌజన్య, నీరజ, అవనిజ, సామాన్య శాస్త్ర అధ్యాపకులు మాలిక్, రమేష్, శ్రీహరి, సంధ్యారాణి లు పర్యవేక్షించారు. ఈ పోటీల ఫలితాలను ఈనెల 22 శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ప్రకటించి మేమంటోలను అందజేస్తామని తెలిపారు.
