బ్రహ్మాకుమారీస్ అనాథ పిల్లలకు సహాయం
రామ్ కోఠీలోని నవ జీవన అనాథ ఆశ్రమం లో చిక్కడపల్లి లోని బ్రహ్మా కుమారీస్ శాఖకు చెందిన సభ్యులు శుక్ర వారం సందర్శించారు అక్కడి పిల్లల అవసరాలను గుర్తించి నోట్ పుస్తకాలు పెన్నులతో పాటు తిను బండారాలు అందించారు. ఈ విషయాన్ని చిక్కడపల్లి లోని బ్రహ్మాకుమారీస్ కార్యాలయం లో ఇన్చార్జి జయశ్రీ తెలుపుతూ ప్రేమికుల రోజు అని యువతీ యువకులు విద్యార్థులు పరస్పర ప్రేమ తెలుపుకొనేందుకు ఎంతో ధనం ఖర్చు చేస్తున్నారని ఇందుకు బదులుగా అవసరమైన వారికి సహాయం చేస్తే మానసిక ప్రశాంతత ఆనందం కలుగుతుంది అని సూచించారు.