YSRCP | సైకిల్ ఎక్కిన వైసీపీ నాయకులు

YSRCP | సైకిల్ ఎక్కిన వైసీపీ నాయకులు


పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

YSRCP | జి.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ (YCP) నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో దాదాపు 20 మంది వైకాపాను వీడి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తెలుగుదేశం పార్టీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోనికి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రగుంట దొరబాబు, యర్రగుంట రవి, యర్రగుంట రవితేజ, యర్రగుంట జేమ్స్, వరగాల యేసు, కోమర్లమూడి మణి, వినుకొండ దాసు, గురజాల ప్రియ, బెజవాడ వరలక్ష్మి, బెజవాడ వాసు, వంగూరి ఎరయ్య, యర్రగుంట సురేష్, గుడవర్తి రవి, నిమ్మకూరు దాసు, వరగాల రమేష్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Party) సత్తాను చాటాలని కోరారు. దీనివల్ల వెలగలేరు గ్రామంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన వారు మాట్లాడుతూ.. దార్శనికత కలిగిన సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు, అమరావతి అభివృద్ధి, పారిశ్రామికీకరణ, మంత్రి లోకేష్ ఆధ్వ‌ర్యంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న తీరు, ఎమ్మెల్యే పారదర్శక పాలనను చూసి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వెల్లడించారు.

Leave a Reply