నేడు అవనిగడ్డకు వైయస్ షర్మిల రాక..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల శుక్రవారం అవనిగడ్డకు విచ్చేయుచున్నట్లు డిసిసి అధ్యక్షులు అందే శ్రీరామ్ మూర్తి తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు అవనిగడ్డ రాజీవ్ సెంటర్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంతోపాటు ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

గ్రామీణ ఉపాధి కూలీలకు రోజుకు రూ. 400 చెల్లించాలని, ఉపాధి హామీ పథకం పేరు పాత పేరుని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్న ఉన్నట్లు శ్రీరామ్ మూర్తి చెప్పారు. సమావేశంలో కోడూరు మండల పార్టీ అధ్యక్షులు మొత్తం రెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply