YS Jaganmohan Reddy | అధికార దుర్వినియోగం

YS Jaganmohan Reddy | అధికార దుర్వినియోగం

  • తన అనుయాయుల కోసం బాబు దౌర్జన్యం…
  • పోలీసుల మద్దతుతో ఇల్లు ధ్వంసం..
  • 25సంవత్సరాల కష్టం రోడ్డు పాలు..
  • సుప్రీంకోర్టులో ఉన్న పట్టించుకోరా..
  • సిబిఐ విచారణ జరగాల్సిందే…
  • 42 ఇళ్ల బాధితులకు న్యాయం చేస్తా..
  • మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి…
  • జోజినగర్ ఇండ్ల బాధితుల పరామర్శ…
  • అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ భరోసా…

YS Jaganmohan Reddy | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : తన అనుయాయుల కోసం కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల సహకారంతో ఇల్లు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. జోజినగర్ బాధితులకు న్యాయం జరగాలంటే తప్పకుండా సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

YS Jaganmohan Reddy | 42ఫ్లాట్ల ఇల్లు కూల్చివేత

విజయవాడ (Vijayawada) పశ్చిమ నియోజకవర్గంలోని జోజి నగర్ లో ఇటీవల 42ఫ్లాట్ల ఇల్లు కూల్చివేత ఘటనలో బాధితులుగా ఉన్న వారిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ‌ బెంగళూరు నుండి గన్నవరం చేరుకున్న ఆయన నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడచిన 25 సంవత్సరాలుగా తాము సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నామని, అన్యాయంగా, అక్రమంగా ఇళ్లను కూల్చివేశారని జగన్ వద్ద బాధితులు వాపోయారు. కోర్టు వ్యవహారానికి సంబంధించిన ఈ అంశంపై లాయర్ల సలహాలు తీసుకున్న ఆయన బాధితులకు తప్పకుండా తగిన న్యాయం చేసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

YS Jaganmohan Reddy | సుప్రీంకోర్టులో న్యాయపోరాటం

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారనీ, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోందన్నారు. డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చిందనీ, 42 కుటుంబాలను 200 మంది‌ పోలీసులు వచ్చి నిర్లక్ష్యంగా ఇల్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా కూల్చారనీ, అధికార దుర్వినియోగం చేస్తూ అందరినీ రోడ్డు పాలు చేశారనీ ఆరోపించారు. 2.17 ఎకరాలు రూ.150 కోట్లు విలువైన భూమి నీ కబ్జా చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇందులో ప్రయివేటు వారు ఎంటర్ అయ్యారనీ, 2016లో తప్పుడు డాక్యుమెంట్లు (Documents) సృష్టించారనీ, ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసి దోపిడీ చేశారన్నారు. జనసేన కార్పోరేటర్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. పోలీసులు అన్యాయస్తులకు మద్దతు ఇచ్చి ఇళ్ల కూల్చివేతకు కు‌సహకరించారనీ, 25 ఏళ్లుగా ఉంటున్నారనీ, అన్ని రకాల అనుమతులు ఇచ్చారనీ, బ్యాంకు రుణాలు కూడా వచ్చాయనీ, ఎన్నో ఏళ్లుగా ఈఎంఐలు కూడా కడుతున్నారనీ, స్థలం వేరే వారిది ఐతే అప్రూవల్ ఎలా ఇచ్చారనీ ఆయన సూటిగా ప్రశ్నించారు.

కరెంటు, డ్రైన్స్ ఎలా ఇచ్చారనీ, బ్యాంకు లోన్లు (Bank Lone) ఎలా ఇచ్చారనీ, అన్నీ సవ్యంగా ఉన్నందునే ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. కొనుగోలు జరిగేటప్పుడు కూడా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారని, ఎవరూ అభ్యంతరం చెప్పలేదనీ, రూ.150 కోట్ల విలువైన స్థలం కబ్జా కోసం పేదలను రోడ్డున పడేశారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోదా? అన్న అయన చంద్రబాబును మూడుసార్లు, లోకేష్ ని రెండుసార్లు కలిసిన కనీస ప్రయోజనం లేదన్నారు. కానీ వాళ్ల మనుషులే కుట్ర పన్ని పేదలకు అన్యాయం చేశారనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉందన్నారు.

YS Jaganmohan Reddy | సీబిఐ విచారణ జరిపించాలి…

42ఫ్లాట్ల అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబిఐతో (CBI) విచారణ జరిపించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదలకు వత్తాసు పలకకపోగా ప్రభుత్వమే కోర్టుకు వెళ్లిందనీ, వారి రుణాలను ప్రభుత్వమే తీర్చాలన్నారు. స్థలం ఇక్కడే ఇస్తారా?, మరోచోట ఇస్తారా? అని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

CLICK HERE TO READ  జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ

CLICK HERE TO READ MORE

Leave a Reply