YS Jagan | ఏపీలో రెడ్ బుక్ పాలన.. భయపడి పారిపోతున్న సివిల్ సర్వెంట్స్

తాడేప‌ల్లి : ఏపీలో రెడ్ బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని.. సివిల్ స‌ర్వెంట్స్ భ‌య‌ప‌డి పారిపోతున్నార‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ (Ys Jagan) అన్నారు. తాడేప‌ల్లి (Tadepalli) లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ…. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోయిందని విమర్శించారు. సూపర్ సిక్స్(Super Six) హామీలపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మోసాలను ఎత్తుచూపుతూ పలు నిరసన (protest), ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రైతు, విద్యార్థుల సమస్యలపైనా పోరాటం చేశామని చెప్పారు.

విద్యార్థులు చదువులు మానేసి పనులకు వెళ్లాల్సిన పని వస్తోందన్నారు. ఏడాదిలో విద్యుత్ చార్జిలు (Electricity charges) పెంచి ప్రజలపై రూ.15వేల కోట్ల భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించొద్దన్నారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతుందోని, దీన్ని తట్టుకోలేక ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ హయాంలో పోలీసులు తలెత్తుకుని తిరిగే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని జగన్ పేర్కొన్నారు. వివక్ష లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చూపామన్నారు. చంద్రబాబు మాట వినకపోతే ఆ అధికారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు మాట వినలేదనే డీజీ స్థాయిలో ఉన్న అధికారి పీఎస్సార్ ఆంజనేయులను జైలుకు పంపారని గుర్తు చేశారు. ముగ్గురు, నలుగురు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారని జగన్ మండిపడ్డారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు.

Leave a Reply