YS Jagan | వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది

YS Jagan | వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది
YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైందని, ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలదన్నారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించిందన్నారు. మొదట్నుంచీ ప్రజలు, దేవుడినే నమ్ముకున్నా అన్నారు. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందన్నారు. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు తెలిపారు.
