వికారాబాద్ టౌన్, సెప్టెంబర్ 4 (ఆంధ్రప్రభ): వ్యాన్ ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన తెలంగాణంలోని వికారాబాద్ (Vikarabad) జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధలూరు వద్ద బుధవారం రాత్రి డీసీఎం వ్యాన్ బైక్ ఢీకొని పులుసు మామిడి గ్రామానికి చెందిన శివకుమార్ (Sivakumar) (23) సంఘటన స్థలంలో మృతిచెందగా మరో యువకుడు సిద్ధులు గ్రామానికి చెందిన పరమేష్ (Paramesh) కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply