పురుగుల మందు తాగి యువకుడి….

కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దప‌ల్లి జిల్లా మండలంలోని పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి గ్రామానికి చెందిన గోపగోని అజయ్ కుమార్ బీటెక్ ఫెయిల్ అవ్వడంతో, మద్యానికి, జల్సాలకు అలవాటు పడ్డాడు. పేగడపల్లి వ్యవసాయ పెట్టుబడి కోసం తెప్పించిన అప్పును జల్సా చేశాడు.

అప్పులు అధికమై తీర్చ‌లేక మానసిక వేద‌న‌కు గురైన‌ అజయ్, గత శనివారం పొలం వద్ద పురుగుల మందు తాగి, కుటుంబ సభ్యులకు స‌మాచారం ఇచ్చాడు. దీంతో అజ‌య్‌ను వెంట‌నే చికిత్స నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండ‌గా మృతి చెందినట్లు మృతుడి తండ్రి గోపగాని సదయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఎస్సై వెంకటేష్ దర్యాప్తు ప్రారంభించారు

Leave a Reply