లైంగిక వేధింపులపై యువతి ఫిర్యాదు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ (KA Paul)పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు సమాచారం. కేఏ పాల్ ఆఫీసులో పనిచేస్తున్నఒక యువతి.. తనను లైంగికంగా(sexually) వేధిస్తున్నారని షీ టీమ్స్‌ను ఆశ్రయించి, ఆధారాలు అందజేసినట్లు బాధితురాలు తెలిపింది.
షీ టీమ్(she team) కేసును పంజాగుట్ట పోలీసులకు(to the police) ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

