అనుమానాస్పద మృతి..

అనుమానాస్పద మృతి..
మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలో గంగపురి ఇటుక బట్టి సమీపంలోని ఓ యువకుడు (young man) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు మండలంలోని స్వర్ణపల్లి గ్రామానికి చెందిన ఉప్పు మహేష్ (35) గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించి, సంఘటన పైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
