yearly2movies | ప్రభాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే..

yearly2movies | ప్రభాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే.. మూడు సినిమాలు(3 movies) ఫైనల్ అయి సెట్స్ పైకి వచ్చేందుకు రెడీగా ఉంటున్నాయి. ఇప్పుడు రాజాసాబ్ గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. ఓ విషయంలో మాత్రం ప్రభాస్ ను చూసి మిగిలిన హీరోలు నేర్చుకోవాల్సిందే అనే మాట అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రభాస్ ఏం చేసాడు..? మిగిలిన హీరోలు ఏం నేర్చుకోవాలి..?
yearly2movies | విదేశాల్లో సైతం వీరాభిమానులు..

బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించి.. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత ప్రభాస్.. ఆ క్రేజ్ ను ఎలా కంటిన్యూ చేస్తాడో అనుకున్నారు. అయితే.. పక్కా ప్లానింగ్(Thorough planning) తో సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. బాహుబలి సినిమా ఏదో లక్కీగా హిట్ అయ్యింది.. ఆతర్వాత ప్రభాస్ కు అంత క్రేజ్ ఏమీ ఉండదు అని నార్త్ మీడియాలో కథనాలు రాసారు. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాతో(With the movie Saaho) విమర్శలకు సరైన సమాధానం చెప్పాడు అనుకోవచ్చు. విచిత్రం ఏంటంటే.. సాహో సినిమా సౌత్ లో ప్లాప్ అయ్యింది.. నార్త్ లో హిట్ అయ్యింది. దీనిని బట్టి ప్రభాస్ కు నార్త్ లో ఎంతలా క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ప్రభాస్ కు వీరాభిమానులు ఉండడం విశేషం.
yearly2movies | దటీజ్.. ప్రభాస్..

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో… ప్రభాస్ అభిమానులకు ఓ మాట ఇచ్చాడు. అది ఏంటంటే.. అభిమానులను అలరించడానికే కష్టపడుతున్నానని.. వాళ్ల కోసం ఎక్కువ సినిమాలు(movies) చేస్తున్నానని చెప్పాడు. అంతే కాకుండా.. ప్రతి సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. రెండు సినిమాలను రిలీజ్ చేసేందుకు హార్డ్ వర్క్(hard work) చేస్తూ.. దటీజ్ ప్రభాస్ అనిపించారు. 2026లో జనవరి 9న ది రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది. ఇదే సంవత్సరంలో ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఫౌజీ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
yearly2movies | ఏడు సినిమాలు వెయిటింగ్..
ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాను చాలా స్పీడుగా చేసేందుకు సందీప్ పక్కా ప్లాన్ రెడీ చేశాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కల్కి 2, సలార్ 2, ప్రశాంత్ వర్మతో భారీ సినిమా చేయాల్సివుంది. అలాగే రాజాసాబ్ 2, ఫౌజీ 2 కూడా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. అంటే.. ఏడు సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరో సినిమాని ఫైనల్(another final movie) చేయడకే కొంత మంది హీరోలకు కష్టంగా ఉంది. అలాంటిది ఒక సినిమా సెట్స్ పై ఉండగానే 7 సినిమాలకు ఓకే చెప్పాడంటే.. మామూలు విషయం కాదు..
yearly2movies | ఒకే ఒక్కడు..

స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేయడమే కష్టం అవుతుంది. అలాంటిది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్(Movies released) చేయడం అంటే.. మామూలు విషయం కాదు. స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే.. సినీ కార్మికులకు పని దొరుకుతుంది.. సినిమా హాల్లు కళకళాడతాయి. సినిమా హాల్లు ఫుల్(The halls are full) అయితే.. అక్కడ టీ, సమోసాలు అమ్ముకునేవాళ్లు.. పార్కింగ్ వాళ్లు.. ఇలా చాలా మందికి మంచి జరుగుతుంది. ఇది ఇండస్ట్రీకి ఎంతో మంచిది. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఓ అరడజనకు పైగా సినిమాలు చేస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్. సో.. ప్రభాస్ ను మిగిలిన హీరోలు కూడా ఫాలో అయితే.. ఎక్కువ సినిమాలు చేస్తే.. అందరికీ మంచిది. మరి.. మిగిలిన హీరోలు కూడా ప్రభాస్ ఆలోచించినట్టుగా ఆలోచించి స్పీడు పెంచుతారేమో చూడాలి.
