AP | వైసీపీ ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా !
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఫీజుకి ఎంబర్స్మెంట్ను వాయిదా వేస్తున్నట్లు వైయస్సార్సీపి కేంద్ర కమిటీ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5న వైఎస్సార్‌సీపీ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.