Yadardri | రెండు బ‌స్సులు ఢీ … 14 మందికి గాయాలు

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెంలో బుధవారం తెల్లవారుజామున కంటైనర్‌ను రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్‌లోనే డ్రైవర్‌ ఇరుక్కుపోయాడు. డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ నుంచి బస్సు విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *