X-ray screening | మొబైల్ ఏ ఐ చెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ క్యాంపు…

X-ray screening | మొబైల్ ఏ ఐ చెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ క్యాంపు…
X-ray screening | చిట్యాల, ఆంధ్రప్రభ : క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని డిఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో జిల్లా క్షయ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్(X-ray screening) క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ ను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, వెలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… క్షయ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. సర్పంచ్ మాట్లాడుతూ… జిల్లా క్షయ నివారణ కేంద్రాన్నిఅభినందించారు. జిల్లా క్షయ నివారణ(tuberculosis prevention) అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ… జిల్లాలోనీ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుకుతుందని ఆయన తెలిపారు.
ఈ క్యాంప్ ను ప్రతి ఒక్కరూ వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, జ్వరం, దగ్గు, ఇతర వ్యాధులు కలిగిన ప్రతి ఒక్కరు చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఆధునిక ఆర్టిఫీషియల్(artificial) ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో 10 నిమిషాలలో ఎక్స్ రే పరీక్ష పూర్తవుతుంన్నారు.
ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్లు అజయ్, సైదులు, అంజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్ సమీయొద్దీన్, డాక్టర్ ఉబ్బు నర్సింహ, టీడీ కోఆర్డినేటర్ మోత్కూరు శ్రీనివాస్, టీబీ అలర్ట్ ఇండియా జిల్లా కోఆర్డినేటర్ ఇనాయత్ ఆగా, టీబీ నోడల్ అధికారి లక్ష్మి , విక్రమాదిత్య, శాంతమ్మ, నాగమణి ఎక్స్ రే టెక్నీషియన్ లెనిన్ స,102 సిబ్బంది నాగరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, వార్డు సభ్యులు ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.
