WTC Final | నిప్పులు చెరిగిన స‌ఫారీలు.. ఆసీస్ ఆలౌట్ !

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ఫైనల్‌ తొలి రోజు దక్షిణాఫ్రికా ఆధిపత్యం చాటింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ బవూమా బౌలింగ్ ఎంచుకోగా, ఆ నిర్ణయం జట్టు ప్రయోజనాలకే నిలిచింది. బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై స‌ఫారీల‌ దళం అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాను 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ చేసింది.

రబడా విజృంభణ – ఐదు వికెట్లు !

నిప్పులు చెరిగిన‌ సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడా.. ఫైఫ‌ర్ తో చెల‌రేగాడు. రబడా 15.4 ఓవర్లలో 5 వికెట్లు – 51 పరుగుల విలువైన ఫిగర్స్ అందించాడు. మార్కో జాన్సన్ మూడు వికెట్లు తీయ‌గా.. కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్ చెరో వికెట్ తీసి ఆసీస్‌ను త్వరగా కట్టడి చేశారు.

ఆసీస్ ఇన్నింగ్స్ !

ఆస్ట్రేలియా జ‌ట్టు మొదటి సెషన్‌లోనే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే స్టీవ్ స్మిత్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తూ 66 పరుగులతో ఆక‌ట్టుక‌న్నాడు. స్టీవ్ స్మిత్ కు మద్దతుగా నిలిచిన‌ బ్యూ వెబ్‌స్టర్… 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెబ్‌స్టర్ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆలెక్స్ క్యారీ 23 పరుగుల వద్ద వికెట్ వదిలేసి కీలక సమయానికి ఔటయ్యాడు. ఇక‌ టీ విరామం తర్వాత ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో మొత్తంగా ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది.

ఇక బ్యాటర్ల వంతు..

ఈ విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇప్పుడు సౌతాఫ్రికా బ్యాటర్లు ముందుకు రావాల్సిన సమయం. పిచ్‌లో ఇంకా పేసర్లకు సహకారం ఉంది. ఆసీస్ పేసర్లు మొదటి ఇన్నింగ్స్‌లో తేలిపోవడం వల్ల వారు ఈసారి బాగా రాణించాల్సిన అవసరం ఉంది.

అదిరే బౌలింగ్ ప్రదర్శనతో ఆక‌ట్టుకున్న‌, దక్షిణాఫ్రికా.. ఇప్పుడు బ్యాటింగ్ తో బ‌రిలోకి దిగ‌నుంది. అయితే, పిచ్‌పై పేసర్లకు ఇప్పటికీ సహకారం ఉండ‌టంతో.. తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన ఆసీస్ పేసర్లు ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తారని భావిస్తున్నారు.

Leave a Reply