- రన్నరప్ నుండి చివరి స్థానం వరకు భారీ ప్రైజ్ మనీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. జూన్ 11 నుండి 15 వరకు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య ఫైనల మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా, ఈ ఫైనల్ ఫైట్ ప్రైజ్ మనీని ఐసీసీ వెల్లడించింది. ఈసారి డబ్ల్యూటీసీ విజేతకు ఐసిసి రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది.
విజేతకు భారీ ప్రైజ్ మనీ..
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతకు దాదాపు రూ.30 కోట్ల 8 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. అయితే, ఓడిన జట్టుకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభిస్తుంది. గతంలో రన్నరప్ జట్టుకు 6.8 కోట్ల ప్రైజ్ మనీ లభించగా, ఈసారి వారికి దాదాపు రూ.18.5 కోట్లు అందుతాయి.
అంతేకాకుండా, ఐసీసీ విన్నర్, రన్నర్‌కే కాకుండా ఇతర జట్లకు కూడా ప్రైజ్‌మనీ ప్రకటించింది. చివరి స్థానం వరకు ఏ జట్టు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళదు. గత రెండు ఫైనల్స్‌లో ఆడిన భారత జట్టు ఈసారి మూడవ స్థానంలో నిలిచింది. కాగా, మూడవ స్థానంలో నిలిచి జట్టుకు రూ.12 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
- మూడో స్థానంలో ఉన్న టీమిండియాకు 12 కోట్లు,
- నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు 10.2 కోట్లు,
- ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు 8.2 కోట్లు,
- ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు 7.1 కోట్లు,
- ఏడవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు 6.1 కోట్లు,
- ఎనిమిదవ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు 5.1 కోట్లు,
- తొమ్మిదవ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు 41 లక్షల రూపాయలు లభించనున్నాయి.
టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ICC ఈ నిర్ణయం తీసుకుంది.