WPL 2025 | రేపే టైటిల్‌ ఫైట్ !

  • ముంబై, ఢిల్లి మధ్య తుది పోరు !

డబ్ల్యూపీఎల్‌ మూడో సీజన్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఢిల్లి క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. రేపు ముంబై వేదికగా ఇరుజట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరగనుంది.

కాగా, ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటే.. ఈ సీజన్‌లో చిరస్మరణీయ ప్రదర్శనలతో రాణిస్తున్న ఢిల్లి క్యాపిటల్స్‌ రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ఇప్పటి వరకూ రెండు డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లు జరుగగా.. ఆ రెండిలోనూ ఢిల్లీ ఫైన‌ల్స్ కు చేరింది. అయితే క‌ప్ ను చేజిక్కించుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో ఈసారి ఎలాగైనా ఫైన‌ల్లో గెలిచిన క‌ప్పును ఒడిసిప‌ట్టాని ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు బ‌రిలోకి దిగుతొంది.

మరోవైపు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ రెండో టైటిల్‌పై కన్నేసింది. ఇరుజట్లు స్టార్‌ ఆటగాళ్లతో నిండిఉండటంతో ఈ ఫైనల్‌ పోరు హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది.

జట్ల వివరాలు (స్క్వాడ్స్‌)

ముంబై ఇండియన్స్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), అక్షిత మహేశ్వరి, అమందీప్‌ కౌర్‌, అమన్జోత్‌ కౌర్‌, అమెలియా కెర్‌, చొలె ట్రైయాన్‌, హీలీ మాథ్యూస్‌, జింటిమణి కలిత, కీర్థన బాలకృష్ణ, నదినే ది క్లార్క్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, పరుణిక సిసోడియా, సంజీవన్‌ సంజన, సంస్కృతి గుప్త, జి. కమలిని, యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), సైకా ఇసాక్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌.

ఢిల్లి క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మ, స్నెహ్‌ దీప్తి, అలలీస్‌ కాప్సే, అన్నాబెల్‌ సుదర్లాండ్‌, అరుందతి రెడ్డి, జెస్‌ జాన్సన్‌, మారిజనె కాప్‌, మిన్ను మణి, ఎన్‌ చరణి, నిక్కి ప్రసాద్‌, రాధా యాదవ్‌, షిిఖా పండే, నందిని కశ్యప్‌, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), సారా బ్రైస్‌ (వికెట్‌ కీపర్‌), టిటాస్‌ సాధు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *