WPL 2025 | బెంగ‌ళూరు గ‌డ్డ‌పై ముంబై జోరు !

  • ట్రాక్ లోకి వ‌చ్చిన మాజీ ఛాంపియ‌న్స్
  • ఉత్కంఠ మ్యాచ్ లో ఆర్సీబీపై విజ‌యం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు విజయం సాధించింది. టోర్నీని ఓటమితో ప్రారంభించిన హర్మన్ ప్రీత్ సేన.. ఇప్పుడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ఈరోజు బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ధేశించిన‌ 168 పరుగుల లక్ష్యాన్ని.. 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది ముంబై జ‌ట్టు.

కెప్టెన్ హర్మన్ (50) ప్రీత్ హాఫ్ సెంచరీతో రాణించగా.. నాట్ స్కివర్-బ్రంట్ (42) ధనాధన్ బౌండరీలు బాదింది. ఇక‌ అమంజోత్ కౌర్ (34 నాటౌట్), జి కమలిని (11 నాటౌట్) ఆక‌ట్టుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 197/7 స్కోరు చేసింది. ఎల్లీస్ పెర్రీ (81) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ స్మృతి మందన (26), రిచా ఘోష్ (28) మాత్రమే రెండంకెల పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కు వెనుదిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *