Minister | జర్నలిస్టుల సంక్షేమానికి కృషీ..

Minister | జర్నలిస్టుల సంక్షేమానికి కృషీ..

  • కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం..
  • రాష్ట్రాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం..
  • రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..

Minister | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీ నగర్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్( ఏపీయూడబ్ల్యూజే అనుబంధం) రాష్ట్రస్థాయి విస్తృత సమావేశనికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టుల సమస్యల పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఇండియన్ జర్నలిస్ట్ ఉమెన్స్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ డి సోమ సుందర్,ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ప్రధానకార్యదర్శి ఏపీయూడబ్ల్యూజే కే జయరాజ్, ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకులు చందు జనార్ధన్, ఏపీ ఈఎంజేఏ రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, జర్నలిస్ట్ నాయకులు,జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply