పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

  • మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి
  • మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు
  • పారిశుధ్య మహిళలకు సన్మానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య మహిళా కార్మికుల సేవలు మరువలేనివని మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ల మధ్య చైర్‌పర్సన్ స్వాతి కేక్ కట్ చేసి మహిళా కార్మికులకు, సిబ్బందికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పారిశుధ్య మహిళా కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి వారిని ప్రత్యేకంగా గౌరవించుకున్నారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. కరోనా వంటి కఠిన విపత్తు సమయంలోనూ తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించిన మహిళా కార్మికుల రుణం తీర్చుకోలేనిదని హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంక్షేమం, రక్షణ, వారి ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ పారిశుధ్యంలో మహిళా కార్మికుల పాత్ర కీలకమని, వారి సహకారంతోనే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచగలుగుతున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ సంపత్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, గౌరవ మహిళా కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, మున్సిపాలిటీ పారిశుధ్య మహిళా కార్మికులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply