17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థికి మహిళల ఆదరణ..

17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థికి మహిళల ఆదరణ..

  • వార్డులో అన్ని వర్గాల మద్దతు
  • బీఆర్‌ఎస్ 17వ వార్డు అభ్యర్థి శనిగరం రజిని నవీన్ విస్తృత ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజిని నవీన్ కు మహిళల ఆదరణ వెల్లువెత్తుతుంది. వార్డులోని అన్ని వర్గాల ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు అభ్యర్థి శనిగరం రజిని నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డులోని వివిధ కాలనీల్లో అభ్యర్థి రజిని నవీన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులోని ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇవ్వడం జరిగింది. వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అభ్యర్థి శనిగరం రజిని నవీన్ ఓటర్లకు తెలియజేశారు. అభ్యర్థి వెంట శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, బిఆర్ఎస్ 17వ వార్డ్ నాయకులు చట్ల వెంకటేశ్వర్లు, తోట రవీందర్, మహమ్మద్ అల్తాఫ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply