మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణించినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేశారు. శ్రీదేవి మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని కొనియాడారు.
అనంతరం యోగా గురూజీ ఉమారాణిని, కూచిపూడి నృత్య గురువు అర్చనను ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా హాజరైనవారంతా మాజీ ఎమ్మెల్యే శ్రదేవిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, కౌన్సిలర్ అభ్యర్థులు సుక్క సరిత, గుర్రం శ్రావణి, సీనియర్ నాయకులు మద్దెర్ల శ్రీనివాస్, భాగమోహన్, నాయకురాళ్లు కోదాటి కళావతి, చింతకింది లావణ్య, లక్ష్మి, సుధా, శోభ, దివ్యాంజలి తదితరులు పాల్గొన్నారు.
