మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వలంబన సాధించాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మహిళలుస్వయంఉపాధితో ఆర్థిక స్వలంబనసాధించాలని ఊట్కూర్ ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో యాక్సెస్,లవ్లీహుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయంఉపాధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ యాక్సెస్ లైవ్లీహుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డి ఎఫ్ ఐ ప్రాజెక్ట్ కింద మహిళల కోసం ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహిళా అభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ శిక్షణలో పీఎంఈజిపి, పీఎం ఎఫ్ఎంఈ, ఎమ్మెస్ ఎం ఈ రుణాలు వాటి అర్హతలుదరఖాస్తు విధానం సబ్సిడీ వివరాలు బ్యాంకుల పాత్రలపై వివరిస్తామని అన్నారు. మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చేసుకునే విధానాలపై అవగాహన ఈ కార్యక్రమం డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ మంజునాథ్ పర్యవేక్షణలో క్లస్టర్ మేనేజర్ హరిలత సమన్వయంతో అవగాహన కల్పించారు. మహిళలకు అందుబాటులో ఉన్న బ్యాంకు రుణాలు, ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార నిర్వహణపై వివరించారు. ఆర్థిక అక్షరాష్యత కేంద్రం కౌన్సిలర్ చందుసుల్తానాప్రఘతి సఖిస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply