women Rs. 2500 | కేసుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ

women Rs. 2500 | కేసుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ
- జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
women Rs. 2500 | ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్రప్రభ : బీజేపీ(BJP) పాలకులు కేసుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ అని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla’s poem) డిమాండ్ చేశారు. ఈ రోజు శేరిలింగంపల్లి నియోజక వర్గంలో జనంబాట కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసులు పెట్టడం పక్కకు పెట్టి పెండింగ్ లో ఉన్న చాలా సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో పూర్తిగా విఫలమయ్యారని కవిత ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(central and state governments)ను ప్రజలు గమనిస్తున్నారని చట్టం, న్యాయం మీద తమకు నమ్మకం ఉందన్నారు.
రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, అందులో నంబర్ వన్ బాధితురాలిని తానే అని ఇంకా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతారంటరని ఆమె పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే రిచ్ నియోజకవర్గమని అంటారని, ఇలాంటి నియోజక వర్గంలో ఇబ్బందులు చాలా ఉన్నాయని కవిత ఆరోపించారు. పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు(Bungalows, Villas, Companies), ధనవంతులు ఎంతోమంది ఉన్నారని, అదే సమయంలో దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు, పేద బస్తీలు చాలా ఉన్నాయని, వాటిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.
ఫ్రీ కరెంట్, గ్యాస్, మహిళలకు రూ. 2500(women Rs. 2500), ఆరు గ్యారంటీలు అని ఇచ్చిన హామీలు ఏమైనట్లు ఆమె ప్రశ్నించారు. హామీలు ఎలాగూ ఇవ్వలేరు అని, కనీసం ఈ బస్తీలో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నారా ? అని ప్రశ్నించారు. స్థానికులు వెళ్లి అడిగితే మున్సిపల్ అధికారులు లీడర్లు చెప్పాలని అంటున్నారంట, మున్సిపల్ అధికారులు బస్తీ వాసులకు కనీస పనులు చేయకపోతే ఎట్లగని, ప్రజలను మభ్య పెట్టటం మానేసి వారికి మంచి చేసే పని చేయాలనీ కవిత డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డులు(ration cards) ఇవ్వలేదని ఆరోపించారని, ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదనీ కవిత ప్రశ్నించారు.
స్మశానం నుంచి పాములు ఇళ్లల్లోని వస్తున్న పరిస్థితి ఉందని, చెత్త తీసుకెళ్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారంట ఇదేమి ప్రభుత్వమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి , స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇక్కడి సమస్యలను పట్టించుకొని వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. బస్తీ వాసులకు జాగృతి అండగా ఉంటుందనీ వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు..


