నారీ శక్తి దేశాభివృద్ధికి ప్రధాన బలం: ప్రధాని మోదీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ ; నారీ శక్తి దేశాభివృద్ధికి ప్రధాన శక్తి కాబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మహిళల శక్తి – ప్రజాస్వామ్యానికి బలంగా మారుతుందన్నారు. మహిళల భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది అని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన భవనంలో నారీ శక్తివంతం సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై ప్రసంగించారు. ముఖ్యంగా ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్‌పై ప్రత్యేక చర్చ జరగనుందని ఉన్నారు.
2023లో నారీ శక్తి వందన్ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం లభించిందన్నారు 2029 నాటికి అమలు లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశ నిర్మాణంలో మహిళల కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు కీలక పదవుల్లో మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. గ్రామీణ స్థాయిలో మహిళల ఎదుగుదల కనిపిస్తోందన్నారు. దేశంలో 14 లక్షలకు పైగా మహిళలు స్థానిక సంస్థల్లో పని చేస్తున్నారని తెలిపారు.
21 రాష్ట్రాల్లో పంచాయతీల్లో 50% వరకు మహిళల భాగస్వామ్యం ఉందని, దీని ద్వారా. మహిళల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదివరకే బేటీ బచావో – బేటీ పడావో, మాతృ వందన, సుకన్య సమృద్ధి వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉజ్జ్వల, హర్ ఘర్ జల్, ఆయుష్మాన్ భారత్ ద్వారా జీవన ప్రమాణాల పెరుగుదలకు తోడ్పాటును అందిస్తాయన్నారు. జనధన్ ద్వారా కోట్ల మహిళలకు బ్యాంక్ ఖాతాలు తెరవడం జరిగిందన్నారు.
ఆర్థిక & సామాజిక పురోగతి ముద్రా లోన్స్‌లో 60% మహిళలకు ఇస్తున్నామని, అలాగే స్టార్టప్‌లలో 42% మహిళల భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు. 3 కోట్లకు పైగా మహిళలు గృహ యజమానులయ్యారు అని తెలిపారు. విద్య & సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారని అన్నారు. ఫైటర్ పైలట్లు, డ్రోన్ దీదీలుగా మహిళల ఎదుగుదల కనిపిస్తుందన్నారు. NDA, సైనిక్ స్కూల్స్‌లో అవకాశాలు కల్పిస్తున్నమన్నారు.
మహిళల భద్రతకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు, ఈ-ఎఫ్‌ఐఆర్, జీరో ఎఫ్‌ఐఆర్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు కఠిన చట్టాలు అమలు చేస్తున్నమన్నారు. మహిళలు తమ అభిప్రాయాలను ఎంపీలకు తెలియజేయాలి అని సూచించారు. నారీ శక్తి చర్చను గ్రామాల వరకు తీసుకెళ్లాలి అని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల హక్కులు – దేశ భవిష్యత్తుకు కీలకం అని,నిర్ణయాలలో మహిళల పూర్తి భాగస్వామ్యం అవసరం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మహిళ బిల్లుకు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు.
