గుండె పోటుతో మహిళ మృతి

గుండె పోటుతో మహిళ మృతి

వికారాబాద్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్ అలైన్మెంట్స్(Triple R Alignments) మార్పు జ‌ర‌గ‌డంతో వికారాబాద్ జిల్లాలోని నవపేట, పూడూర్, మోమిన్పేట్ మండలాల్లో, వివిధ గ్రామాల్లో రైతుల భూములు కోల్పోతున్నామ‌న్న‌ భావనతో గత కొంతకాలంగా రైతుల్లో ఆందోళన నెలకొంది.

తమకు ఉన్న‌ రెండు ఎకరాలు భూమి(two acres of land) కోల్పోతున్నాం అన్న నెపంతో ఓ మహిళ గుండెపోటుతో మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాపేట మండలం చించలపేటలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా నవాపేట మండలం చించలపేటకు చెందిన అంజ‌మ్మ గ‌త నెల నుండి భూమి పోతుంది అనే మనస్థాపంతో గుండెపోటు వ‌చ్చి మృతి చెందింది. చించల్పేట్ గ్రామానికి చెందిన అంజయ్యకు రెండు ఎకరాల భూమి 132 సర్వే నంబర్(132 survey number) లో ఉంది.

గత నెల నుండి ఇద్దరు భార్య భర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అంజయ్య భార్య అంజమ్మ గుండెపోటుతో మృతి చెందింది. ఈ విష‌యం తెలిసిన రైతులు చించ‌ల్‌పేట గ్రామానికి చేరుకున్నారు. ట్రీబుల్ ఆర్ రోడ్డులో రెండు ఎకరాల సాగు భూమి మొత్తం పోతుందని మానసిక ఆవేదన చెంది కుమిలిపోతున్న నేపథ్యంలో మృతి చెందిన సంఘటన త్రిబుల్ ఆర్ రైతులను ఆందోళన కలిగిస్తుంది.

Leave a Reply