KNL | ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి..
తుగ్గలి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ) : మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఇవాళ ఉదయం కూలీ పనికి వెళ్లిన మధులక్ష్మి (42) ప్రమాదవశాత్తు నీటి బావిలో పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
మధులక్ష్మి నీటి కోసం బావి దగ్గరకు వెళ్లి నీళ్లు ముంచుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలోకి పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని పక్కనే ఉన్న వారి బంధువు గమనించి బావిలో పడ్డ ఆమెను కాపాడాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.