నీటిసంపు మింగేసింది
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా(Khammam District), సత్తుపల్లి మున్సిపాలిటీలోని రాజీవ్ కాలనీలో ఆదివారం వివాహిత ఒకరు నీటి సంపులో పడి మృతి చెందారు.. కాలనీలో చిల్లర దుకాణం, టెంట్ హౌస్ నడుపుతున్న రత్నాకర్ రావు భార్య మట్టపర్తి వాణి (50) ప్రమాదవ శాత్తు సంపులో పడడంతో నీట మునిగి ప్రాణాలు విడిచారు.
ప్రమాదంతో రాజీవ్‌కాలనీ(Rajivkalani)లో విషాదం అలుముకుంది. కాలనీ వాసులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై వాణి మృతదేహానికి నివాళి ఘటించారు.

