కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
అత్తింటి వారి వేధింపులే కారణం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రతీ సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం మందిరంలో సోమవారం మహిళ పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పోలీసులు తనిఖీ నిర్వహించిన పెట్రోల్ బాటిల్‌ను గుర్తించలేదు. అత్తింటి వారి నుంచి రావాల్సిన ఆస్తులను రానీయకుండా వేధిస్తున్నారని మనస్థాపంతో పెట్రోల్ తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది.
ఆత్మహత్యకు పాల్పడిన తోట కృష్ణవేణి స్వస్థలం పెనమలూరు నియోజకవర్గం ఎనమలకుదురు డొంక రోడ్డు. నూతక్కి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అండదండలతో అత్తింటి వారు వేధిస్తున్నారని. వేధింపులను తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితురాలు తెలిపింది. ప్రజా సమస్య పరిష్కార వేదికకు వచ్చిన బాధితులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు పోలీసులను కోరారు.

