AP |ఢిల్లీలో గెలుపుతో.. ప్రధాని పై విశ్వాసం మరోసారి రుజువైంది : పవన్
అమరావతి: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ విజయంపై స్పందిస్తూ.. “2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుంది. అమితా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయి” అని అన్నారు.