KARTHIKA LIGHTS| కార్తీక దీపాలతో…

KARTHIKA LIGHTS| కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మార్గశిర మాసం తొలి పాడ్యమి పురస్కరించుకొని కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేకువ జాము నుంచే భక్తులు పుష్కర ఘాట్, సముద్రంలో పుణ్య స్నానాలు చేసి దీపాలను వెలిగించి పూజలు చేశారు. కార్తీక దీపాలను దొప్పలలో పెట్టి నదిలోకి వదులుతూ వెళ్లి రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. నాగాయలంకలోని శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. వేకువ జాము నుంచి ఘాట్ కి ఆబాల గోపాలం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

దీపాలను దొప్పలలో పెట్టి నీటిలోకి వదలగా, కృష్ణమ్మ వదనం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. మచిలీపట్నంలోని పలు దేవాలయాల్లో, బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను, అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక, మోపిదేవి, కోడూరు, ఘంటసాల చల్లపల్లిలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాగనంపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలలోని తోట్లవల్లూరు, ఐలూరు, శ్రీకాకుళంలోని నదీ ప్రాంతాలకు వెళ్లి దీపాలను నదిలో వదలడం కనిపించింది. పలు దేవాలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply