జోనల్ స్పోర్ట్స్ మీట్ షురూ..
ఐదు జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులు
ఆంధ్రప్రభ ప్రతినిధి ములుగు : ములుగు జిల్లా (Mulugu district) లోని జాకారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జోనల్ లెవెల్ క్రీడలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఐదు జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రీడల్లో అండర్ 14 ,అండర్ 17, అండర్ 19 విద్యార్థులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ (Additional Collector Mahender), ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య, ములుగు డీఈవో సిద్ధార్థ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ హాజనయ్యారు.

