హైదరాబాద్ – అమెరికాలోని ప్రఖ్యాత వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న మేనల్లుడు, ఎం.ఎల్.సి కవిత పెద్ద కొడుకు ఆదిత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తామంతా గర్వపడేలా ఆదిత్య కష్టపడి డిగ్రీ పట్టా సాధించాడని ప్రశంసించారు. ఇది ఆరంభం మాత్రమే అన్న కేటీఆర్, భవిష్యత్తులో మరిన్ని విజయాలను ఆదిత్య అందుకుంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పుత్రోత్సాహంలో ఉన్న సోదరి కవిత, బావ అనిల్ కుమార్ లకు కేటీఆర్ అభినందనలు చెప్పారు.
Wishes | గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న మేనల్లుడు – శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
