Winning | ఓటమి ఎరుగని సర్పంచ్..

Winning | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం.. గ్రామ అభివృద్ధికి పెద్ద పీట వేయడం.. ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండి గ్రామ అభివృద్ధి పనుల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకోవడంతో గంటా వరసగా నాలుగో సారి విజయం సాధించారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ గా గంటా రమేష్ విజయం సాధించడంతో వరుసగా నాలుగో సారి ఓటమి ఎరుగని నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2006లో గంటా రమేష్ సతీమణి గంటా లావణ్య ఎంపీటీసీగా గెలుపొందారు. 2013లో గంటా రమేష్ రంగాపూర్ సర్పంచ్ గా గెలుపొందారు.

2019లో సర్పంచ్ గా గంటా లావణ్య మరోసారి ఎన్నికయ్యారు. ఇటీవల మరోసారి సర్పంచ్ గా గెలుపొందడంతో నాలుగోసారి విజయం సాధించారు. రంగాపూర్ గ్రామంలో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంతో ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోయారు. ప్రతి నిత్యం గ్రామంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలో ఏ అవసరం ఉన్నా అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయాలు అందిస్తూ చేదోడుగా నిలుస్తున్నారు. దీంతో గంటా దంపతులను రంగాపూర్ ప్రజలు 20 ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. నాలుగోసారి విజయం సాధించి రమేష్ ఆదర్శంగా నిలిచారు.

Leave a Reply