సమస్యలు లేకుండా చేస్తా

  • పురాణిపేట్ సర్పంచ్ అభ్యర్థి తోట లావణ్య హరీష్ ,

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామంలో సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా పని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి తోట లావణ్య, హరీష్ అన్నారు. శనివారం భీమ్‌గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ తనకు అమూల్యమైన ఓటు వేసి విజయం అందించాలని కోరారు. మహిళల సమస్యలు తెలిసిన తనను గెలిపిస్తే మహిళల సంక్షేమం కొరకు పాటు పడతానని పేర్కొన్నారు.

గతంలో ఎందరో గ్రామాన్ని పాలించారని, సమస్యలు పరిష్కారం చేయడం లో వారు పూర్తిగా విఫలం అయ్యారని, తాను గెలిస్తే వారి పాలనకు భిన్నంగా చేస్తానని పేర్కొన్నారు. గ్రామం లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారం, మురికి కాలువల నిర్మాణం చేపించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ఆరోగ్య సేవలు, యువత క్య లైబ్రరీ సౌకర్యం కల్పించడం తన లక్ష్యం అన్నారు.

అన్ని వర్గాలకు వైకుంఠ దామాలు అన్ని అందులో అన్ని వసతులు ఏర్పాటు కొరకు కృషి చేస్తామని అన్నారు. తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని తన గుర్తుకు ఓటు వేయాలని కొరారు. ప్రచార కార్యక్రమంలో ఆమె వెంట మహిళలు, యువకులు పేద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply