కొత్తగూడ, మే 11(ఆంధ్రప్రభ) : అడవిపంది దాడిచేసిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ నుండి నర్సంపేట వెళ్లే దారిలో గువ్వలబోడు సమీపంలో నర్సంపేటకు వెళుతున్న బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి పై అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న జాటోత్ లక్ష్మి (40) లపై అడవిపంది దాడి చేయగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సహాయంతో నర్సంపేటలోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
Mahbubabad | అడవిపంది దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు
