పత్తి పంట ధ్వంసం

ఆందోళనలో రైతులు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మారుమూల గ్రామపంచాయతీ అయిన చిత్త కర్ర పంచాయతీల్లోని పత్తి పంట పొలాల్లో అడవి పందులు దాడులు చేసి పంటను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కిషన్ నాయక్ తండాకు చెందిన రైతు పత్తి పంటను అడవిపందులు ధ్వంసం చేయగా… ఈరోజు ఉదయం చిత్త కర్ర గ్రామానికి చెందిన ఆదివాసి రైతు కోట్నాక్ ఆనందరావు పత్తి పంటను విధ్వంసం చేసినట్లు రైతు ఆవేదనతో తెలిపారు. అడవి పందులు పంటలపై దాడులు చేస్తూ పత్తికాయలు తింటూ పంటను నాశనం చేస్తున్నాయని, ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేసిన రైతుల పంటలపై సర్వేలు చేసి అటవీ శాఖ ద్వారా ఆదుకోవాలని అడవిపందుల దాడులను నివారించే చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

Leave a Reply