ఉత్తరాఖండ్ లోని ధరాలీని ముంచెత్తిన వరద..
పూర్తిగా కొట్టుకుపోయిన గ్రామం..

కొండలపైనుంచి తరుముకుంటూ వస్తోన్న బురద… ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోవడానికీ వీల్లేని పరిస్థితి… వైరల్ గా మారిన ఉత్తరాఖండ్ జల విలయం విజువల్స్ చూస్తుంటేనే మతిపోతోంది. అక్కడున్న వారి గురించి ఆలోచిస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. పచ్చటి ప్రకృతి నడుమ అలరారుతున్నట్టు అందంగా కనిపించే ప్రాంతమే, అదే అందమైన, ప్రశాంతమైన ప్రకృతి ప్రకోపానికి ఎందుకు గురి కావాల్సి వస్తోంది? అసలేమిటీ క్లౌడ్ బరస్ట్? ప్రభన్యూస్.కాం prabhanews.com మీకందిస్తోంది సమగ్ర విశ్లేషణా కథనం..

ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని ఆకస్మిక వరదలు (Flash floods) ముంచెత్తాయి. మొత్తం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 50 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తున్నది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖేర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో మేఘాల విస్ఫోటనం కారణంగా వినాశకరమైన వరదలు సంభవిం చినట్టు చెబుతున్నారు.

ఉత్తరాఖండ్‌లో ఇప్పుడున్న పరిస్థితికి ప్రధాన కారణాలు:

  1. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు:

మేఘాల ఉరుములు (Cloudbursts): ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం కావడంతో, రుతుపవన గాలులు హిమాలయ పర్వత శ్రేణులకు అడ్డుగా ఉంటాయి. దీంతో తేమతో నిండిన మేఘాలు ఒకేచోట పేరుకుని, చల్లని వాతావరణం కారణంగా ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటివి జరుగుతున్నాయి.

ఆకస్మిక వరదలు (Flash Floods): క్లౌడ్ బరస్ట్ వల్ల నదులలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగి, ఆకస్మిక వరదలు వస్తాయి. ఈ వరదలు బురద, రాళ్లు, చెట్లను వెంటబెట్టుకొని వచ్చి భారీ నష్టాన్ని కలిగిస్తాయి.

  1. భౌగోళిక అస్థిరత (Geographic instability):

బలహీనమైన హిమాలయ పర్వత శ్రేణులు: ఉత్తరాఖండ్ అనేది హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. ఈ పర్వతాలు భూకంపాలు, కొండచరియలు విరిగిపడటానికి చాలా అవకాశం ఉన్న ప్రాంతం.

జోషిమఠ్ తరహా పరిస్థితి: బాగేశ్వర్ జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్ (గనుల తవ్వకం) వల్ల నేల కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గతంలో జోషిమఠ్‌లో జరిగిన ఘటనను పోలి ఉందని వారు పేర్కొన్నారు. సరిహద్దుల్లో తవ్వకాలు, ఇళ్లకు సమీపంలో మైనింగ్, వ్యర్థాలను నదుల్లో పారవేయడం వంటి అశాస్త్రీయ పద్ధతులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.

  1. మానవ తప్పిదాలు, అభివృద్ధి పనులు:

అశాస్త్రీయ మైనింగ్ (Unscientific mining): నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు (Mining operations) ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరంగా మారుస్తున్నాయి. ఇది కొండచరియలు విరిగిపడటానికి, నేల కుంగిపోవడానికి దారితీస్తుంది.

నీటి ప్రవాహాల దిశ మార్పు: మైనింగ్, నిర్మాణ పనుల వల్ల సహజ నీటి ప్రవాహాల మార్గాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల కొండల అడుగు భాగంలో నీరు చేరి, కొండల బలాన్ని తగ్గిస్తుంది.

అభివృద్ధి పనులు (Development works): పర్యాటక రంగం (Tourism sector) కోసం చేపడుతున్న రోడ్ల విస్తరణ, ఇతర నిర్మాణాల వల్ల పర్యావరణ వ్యవస్థ (ecosystem)కు తీవ్ర నష్టం కలుగుతోంది.

  1. వాతావరణ మార్పులు (Weather changes):

గ్లేసియర్ల కరుగుదల: గ్లోబల్ వార్మింగ్ (Global warming) వల్ల హిమాలయాల్లో గ్లేసియర్లు (Glaciers) వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల నదుల్లో నీటి ప్రవాహం పెరిగి, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.

గ్లేసియర్ల కరుగుదల అనేది ఒక తీవ్రమైన పర్యావరణ సమస్య. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడటం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత పెరుగుతుంది. ఇవి సూర్యరశ్మిని గ్రహించి భూమి వేడెక్కడానికి కారణమవుతాయి.

అసాధారణ వర్షపాతం (Unusual rainfall): వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం సరళిలో మార్పులు వస్తున్నాయి. ఒకేసారి అతి భారీ వర్షాలు కురవడమే క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) సంఖ్య పెరగడానికి ఒక కారణం.

ఈ అన్ని కారణాల కలయిక వల్ల ఉత్తరాఖండ్ తరచూ ప్రకృతి విపత్తులకు గురవుతోంది. అక్కడి సున్నితమైన పర్యావరణ వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకుండా చేసే అభివృద్ధి పనులు ఈ విపత్తుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి.

ధరాలీలో జరగింది క్లౌడ్ బరస్టేనా..?

మంగళవారం (ఆగస్టు 5) ధరాలీ గ్రామాన్ని (Dharali village) ధ్వంసం చేసిన ఆకస్మిక వరదకు గ్లేషియర్ (హిమానీనదం) కూలిపోవడం లేదా గ్లేషియర్ సరస్సు ఉప్పొంగడం కారణం అయ్యే అవకాశం ఉందని.. వాతావరణ, ఉపగ్రహ డేటాను విశ్లేషిస్తున్న నిపుణులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. అందుకే అంత భారీ పరిమాణంలో నీటి ప్రవాహంతో బురద ధరాలీని ముంచెత్తి ఉండవచ్చని చెబుతున్నారు. మంగళవారం హర్సిల్ ప్రాంతంలో 24 గంటల్లో 9mm వర్షం మాత్రమే కురిసింది. భట్వానిలో 11mm మాత్రమే పడింది. అయితే క్లౌడ్ బరస్ట్ సంభవిస్తే ఇంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో గ్లేషియర్ కూలిపోవడం, గ్లేషియర్ లేక్ ఉప్పొంగడం వల్లనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2013లో క్లౌడ్ బరస్ట్ వల్లే కేదార్‌నాథ్ విపత్తు కూడా..

క్లౌడ్ బరస్ట్ ఎలాంటి విలయం సృష్టిస్తుందో చెప్పడానికి 2013లో జరిగిన కేదారనాథ్ విపత్తు (Kedarnath disaster) ఓ ఉదాహరణ. ఇది ఉత్తరాఖండ్ లో సంభవించిన అతి పెద్ద విపత్తుల్లో ఒకటి. దీనివల్లే ఉత్తర భారతదేశంలో వాతావరణం తీవ్ర మార్పులకు గురవుతుంది. ఇలా రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ కలయిక వల్ల అసాధారణమైన వాతావరణ పరిస్థితి 2013లో కేదరానాథ్ లో ఏర్పడింది. ఈ రెండింటి కలయిక వల్ల హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యధిక తేమతో కూడిన మేఘాలు ఏర్పడి క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీని వల్ల అతి భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగింది.

ఎక్కడుందీ ఈ ప్రాంతం..?

ఎత్తైన పర్వత సానువుల్లో ఉన్న ధరాలీ.. ఉత్తరాఖండ్ లోని సుందర మైన ప్రాంతాల్లో ఒకటి.. గంగోత్రి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు విడిది.. ఆ ప్రాంతం ఇప్పుడు ఒక్క వరదతో తుడిచిపెట్టుకుపోయి తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం గంట వ్యవధిలో సముద్రం వచ్చి మీద పడిందా అన్న స్థాయిలో మేఘం వర్షించింది. దీంతో భారీ బురద వరద ధరాలీని కప్పేసింది. ఫలితంగా ఇప్పుడు ఆ ప్రదేశం మరు భూమిని తలపిస్తోంది.

చార్ధామ్ యాత్రికులు (Chardham pilgrims) ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. యాపిల్ పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్ లోని హర్సిల్ లోయ (Harsil Valley) ఇక్కడకు సమీపంలో ఉంది. రిషికేశ్ నుంచి బయల్దేరి చంబా, ఉత్తర కాశీ, హర్సిల్ మీదుగా ఇక్కడికి వెళ్లవచ్చు. సముద్ర మట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తున ఈ ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి గంగోత్రి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధరాలీ గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతుంది. చార్ధామ్సహా ఇతర తీర్థ యాత్రల సీజన్లో ఈ గ్రామానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో హోటళ్లు, అతిథి గృహాలున్నాయి. తక్కువ ధరలకే వసతి లభిస్తుండటంతో.. యాత్రికులు వీటివైపు మొగ్గుచూపుతారు. కేదార్ తాల్ ప్రదేశానికి ట్రెక్కింగ్ (Trekking) కు వెళ్లేవారికి ఈ ప్రాంతం బేస్ క్యాంప్ (Base Camp) గా ఉంటుంది.

Leave a Reply