హత్య.. చేసింది ఎవరు..
కొత్తూరు, ఆంధ్రప్రభ : వలస కార్మికుడు దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన శంసు అనే వ్యక్తి జీవనోపాధి నిమిత్తం కొంతకాలం క్రితం కొత్తూరుకు వలసవచ్చాడు. కొత్తూరులో తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వింటేజ్ వెంచర్ లో నిద్రిస్తున్న చోటే రక్తం మడుగులో పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

