పనికి వెళ్లి తిరిగి వస్తుంటే..

పనికి వెళ్లి తిరిగి వస్తుంటే..

కడెం, (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉట్నూర్ వైపు నుండి కడెం వైపు వస్తున్న కారు, కడెం వైపు నుండి ఉట్నూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న పాత ఉట్నూర్ గ్రామానికి చెందిన గొడిపెళ్లి నడిపి మల్లయ్య (60) మృతి చెందగా గొడిపల్లి మల్లేష్, మల్కారి దుర్గయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిద్దరిని 108 వాహనంలో పైలట్ రాకేష్, ఈఎంటి మురళి ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురు ఖానాపూర్ పనికి వెళ్లి తిరిగి ఉట్నూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply