ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే!

ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే!

  • పుట్ట‌గొడుగుల్లా ప్రైవేటు కొనుగోలు కేంద్రాలు!!

వాంకీడి, ఆంద్ర ప్రభ : మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ప్రైవేట్ పత్తి కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రైతులు పత్తి అమ్మాలి(Farmers should sell cotton) అంటే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ (కపాస్ కిసాన్ యాప్)లొ ఆన్ లైన్ చేయాల్సి ఉంటుంది.

యాప్ పట్ల రైతులకు అవగాహన లేకపోవడంతో దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు ఎలాంటి అనుమతులు లేకుండా మండలంలోని పలు గ్రామాలలో యదేచ్చగా పత్తి కొనుగోలు వ్యాపార దందాను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో వాంకిడి మండల కేంద్రంలో చాలా గ్రామాలలో అనుమతులు లేని దుకాణాలను(unlicensed shops should be closed) ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేసుకుంటున్నారు.

మండల కేంద్రం నుండి ఏ దారి గుండా వెళ్ళిన ప్రవేట్ పత్తి కాంటలు దర్శనమిస్తున్నాయి. సీసీఐ కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తే ప్రభుత్వం నిబంధనల ప్రకారం రైతులకు క్వింటాకు రూ.8110 మద్దతు ధర లభిస్తుంది. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని సీసీఐ అధికారులు కావాలనే పత్తిని కొనుగోలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉన్నదనే కారణం చూపించి రైతుల పత్తిని గ్రామాల్లో మాయ మాటలు చెప్పి అడ్వాన్స్ ఆశ చూపించి క్వింటా రూ.6750 లకు(quinta for Rs. 6750) కొనుగోలు చేసుకుని క్వింటాకు రూ.1360 రూపాయలు రైతుల దగ్గర నుండి దండుకుంటున్నారు.

మార్కెటింగ్ శాఖ అధికారులు అనుమతులు లేని ప్రైవేటు కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవడంతో పాటు, సీసీఐ అధికారులు రైతుల పంటను కొనుగోలు చేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఎక్కడేసిన గొంగడి అక్కడే(wherever there is a worm, there is) అన్నసామెతగా అధికారుల తీరు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పత్తి పండించిన రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతుంటే. పత్తి కొన్న దళారులు లక్షలు సంపాదిస్తున్నారని, మండలంలోని అధికారులకు మాత్రం ఇవేమీ కనపడవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను . రైతులు కోరారు.

Leave a Reply